![]() |

బిబి జోడి ఫుల్ జోష్ తో మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఫస్ట్ జోడిగా అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య వచ్చారు. ఈ పేర్లు కాకుండా వీళ్లకు ఒక హ్యాష్ ఇచ్చాడు హోస్ట్ ప్రదీప్. అదే #aarya . ఐతే శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ డాన్స్ కి జడ్జెస్ ఫిదా ఐపోయేసరికి ప్రదీప్ వీళ్లకు ఒక డమ్మీ ఫన్నీ బిబి జోడి మెమెంటో కూడా ఇచ్చేసాడు. ఐతే దీని వెనక ఒక రీజన్ కూడా చెప్పాడు. "ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అని అడిగినప్పుడు శ్రీసత్య నాకు పార్టనర్ ఐతే చాలు సర్ నేను ట్రోఫీ గెలిచినట్టే అన్నాడు" అని ప్రదీప్ చెప్పాడు. (BB Jodi)
"నీకు ఫోన్ వచ్చి నీ జోడి శ్రీసత్య అనగానే నీకేమనిపించింది నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి " అంటూ ప్రదీప్ అడిగాడు. "మొదట ఆశ్చర్యమేసింది తర్వాత ఆనందమేసింది తర్వాత భయం కూడా వేసింది" అన్నాడు. భయమెందుకు అని శేఖర్ మాష్టర్ అడిగాడు. మేడంతో అలా ఉంటది మరి అన్నాడు అర్జున్.
"నాకు ఒక్కటే అర్ధం కావట్లేదు ప్రదీప్ గారు. సత్య లేనిదే ఏం చేయను అంటున్నారు.. అర్జున్ తో నేను సీజన్ మొత్తం చేయాలంటే నాకు 3 కండిషన్స్ ఉన్నాయి. వాటికి ఓకే చెప్తే నేను కంటిన్యూ చేస్తా" అని చెప్పింది శ్రీసత్య. "ఫస్ట్ కండిషన్ ఇప్పటి నుంచి ఫైనల్స్ వరకు ఏదైతే పేమెంట్ ఉంటుందో గెలిస్తే ఒకవేళ ఆ పేమెంట్ కూడా ఇచ్చేస్తే అప్పుడు నేను చేస్తా" అంది. "సర్ నాకు ప్రేక్షకుల ఆదరణ జడ్జిల ప్రేమ ఉంటే చాలు సర్.. కప్పు ఉంటే చాలు సర్ డబ్బులు అవసరం లేదు" అన్నాడు అర్జున్.
ఇంతలో ప్రదీప్ "ఈ సీజన్ ఒక్కటే కాదు ఆయన ఎక్కడ ఏది పెర్ఫార్మ్ చేసినా సరే సీరియల్ కూడా చేస్తున్నాడు ఆ పేమెంట్" అన్నాడు. తర్వాత శేఖర్ మాష్టర్ "దారుణం ఈ షో వరకు ఓకే కానీ" అన్నాడు. ఇంతలో అర్జున్ సంతకం పెట్టేసాడు. అర్జున్ అంతా చదివి అగ్రిమెంట్ మీద సైన్ చేసావా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అని కూడా అందులో ఉంది అన్నాడు ప్రదీప్. ఇంతలో సదా "అర్జున్ అవన్నీ కావాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోమంటూ" అంటూ సలహా ఇచ్చింది. "ఫస్ట్ డాన్స్ అవ్వనివ్వండి అప్పుడు పెళ్లి తర్వాత చూద్దాం" అంటూ శ్రీ సత్య చెప్పింది. దాంతో అర్జున్ కూడా ఆమె వైపు షాకింగ్ గా చూసాడు.
"సెకండ్ కండిషన్ ఏంటంటే నేను లేకపోతే ఏది చేయను అన్నావ్ కాబట్టి నువ్వు సీరియల్ మంచి హిట్ లో ఉంది కదా మరి నేను లేకుండా ఎందుకు చేస్తున్నావ్ . మీ హీరోయిన్ ని తీసేసి నన్ను పెట్టుకో" అంది. "ఆయన రైటర్ ని, ప్రొడ్యూసర్ ని ఒప్పించుకుంటాడు కానీ ముందు యాక్టింగ్ చేయాలి కదా సర్" అంటూ ప్రదీప్ పుల్ల పెట్టాడు. "డాన్స్ బాగా చేస్తుంది కాబట్టి బిబి జోడి అనుకున్నాం ఇప్పుడు యాక్టింగ్ కూడా బాగా చేసి చూపియ్ సీరియల్ లోకి తీసుకుంటాం" అన్నాడు అర్జున్.
"ఇక థర్డ్ కండిషన్ అద్భుతంగా ఉంటుంది. నా మీద అంత ఇష్టం ఉన్నోడు నా పేరును నుదురు మీద టాటూ వేయించుకోలేడా" అని అడిగింది శ్రీసత్య. తరువాత ఒక డ్రిల్లింగ్ మెషీన్ తో ఒకతను టాటూ వేస్తానంటూ వచ్చేసరికి అందరూ నవ్వేశారు.
![]() |